మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం

Apr 10 2026 9:39 AM | Updated on Apr 10 2026 9:39 AM

హన్మకొండ: మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌ రావు విమర్శించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తూ ఉద్యమించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనమూ లేదని తూర్పారబట్టారు. మహబూబాబాద్‌ జిల్లాలో మక్కల కొనుగోళ్లకు 18 సెంటర్లకు అనుమతిస్తే 12 సెంటర్లలో కొనుగోళ్లు చేపట్టామని చెబుతున్నా ఒక్క కేసముద్రం మార్కెట్‌లో మాత్రమే కొంటున్నారని వివరించారు. ఈ జిల్లాలో 95వేల క్వింటాళ్లు ప్రైవేట్‌ వ్యక్తులు కొనుగోలు చేస్తే ప్రభుత్వం 101 క్వింటాళ్లు మాత్రమే కొన్నదన్నారు. హనుమకొండ జిల్లాలో 90 వేల ఎకరాల్లో సాగు చేస్తే నాలుగు సెంటర్ల ద్వారా, ములుగు జిల్లాలో 40 వేల ఎకరాల్లో సాగు చేస్తే నాలుగు సెంటర్లు, వరంగల్‌ జిల్లాలో 6 సెంటర్లు ఓపెన్‌ చేస్తే ఒక్క సెంటర్‌లో మక్కలు కొంటున్నారని వివరించారు. బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంనుంచి స్పందన లేదని విమర్శించారు. గుండ్ల సింగారానికి చెందిన మృతిచెందిన అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని, భార్యకు ఉద్యోగం, రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. స మావేశంలో ‘కుడా’ మాజీ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, నాయకులు సంకు నర్సింగరావు, జోరిక రమేశ్‌, ఉడతల సారంగపాణి, తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్‌, పులి రజినీకాంత్‌, నయీమొద్దీన్‌, కోటేశ్వర్‌ రావు, సదాంత్‌, పున్నం చందర్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌ రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement