వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం రామప్ప శిల్పకళ సంపద అద్భుతమని హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డలో శిక్షణ పొందుతున్న 70 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వ ర స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్, ఆర్‌ఐ రమేశ్, పోలీసు సిబ్బంది భద్రు, శ్రీకాంత్, కోర్స్ డైరెక్టర్ కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు.
ప్రముఖ సినీనటుడు రాజేందర్ పూజలు..
రామప్ప దేవాలయాన్ని సాలార్, దేవర సినిమాల్లో విలన్‌గా నటించిన పులి రాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామికి వారు పూజలు నిర్వహించారు.
కొనియాడిన శిక్షణ అధికారులు


