● స్వామివారి సన్నిధిలో పాము ప్రత్యక్షం
పాలకుర్తి టౌన్: యాథృశ్చికమో.. అద్భుతమో తెలియదు గాని. జనగామ జిల్లా పాలకుర్తి మండం కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి వారి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షవుతోంది. రోజూ మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యం సమర్పించి గుడి మూసిన అనంతరం ఆలయ మహా మండపంలోని గర్భగుడి ఎదుట ఉన్న నందీశ్వరుడి వద్ద వారం రోజులుగా ప్రత్యక్షమై పడగ విప్పి భక్తులకు కనిపిస్తోంది. దీంతో భక్తులు స్వామివారు పాము రూపంలో దర్శనమిచ్చారని భక్తిపారవశ్యానికి లోనవుతున్నారు. అయితే ఆలయ సిబ్బంది మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. కొంత సమయం తర్వాత పాము పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్తోందని ఆలయ సిబ్బంది తెలిపారు.


