బయ్యారం: దంపతుల మధ్య జరుగుతున్న వివాదాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇర్సులాపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వట్టం లక్ష్మయ్య కూతురు అరుణ(35)కు ఇదే మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్‌తో పదేళ్ల క్రితం వివాహం జరగగా ఇరువురు సంతానం. ఈ క్రమంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు వివాదాలు చోటుచేసుకుంటుండగా అరుణ మంగళవారం పుట్టింటికి వచ్చింది. తెల్లవారుజామున బాత్రూమ్‌కి వెళ్లి తన చీరతో ఉరేసుకుంది. బాత్రూమ్‌కి వెళ్లిన కుమార్తె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి బుచ్చిరాములమ్మ తలుపులు కొట్టి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. తలుపులు పగులకొట్టిచూడగా అప్పటికే అరుణ మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
తాటిచెట్టుపైనుంచి పడి
గీత కార్మికుడి మృతి
ఐనవోలు: తాటిచెట్టుపై నుంచి పడి ఓ గీత కా ర్మికుడి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తిలో చో టు చేసుకుంది. స్థాని కుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గట్టు రజినీకాంత్(25) గీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరా అవుతున్నాడు. ఈ క్రమంలో రోజుమాదిరిగానే బుధవారం తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్ర మాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడడంతో స్థానికులు, కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందా డు. దీంతో తల్లిదండ్రులు విజయ, నాగేశ్.. కు మారుడి మృతదేహం మీద పడి గుండెలవిసే లా రోదించారు. ఇది చూసిన గ్రామస్తులు కన్నీ టిపర్యాంతమయ్యారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞ ప్తి చేశారు. కాగా, మృతుడు అవివాహితుడు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
పర్వతగిరి:వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కల్లెడలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యాసారపు యాకయ్య(55) మంగళవారం వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి చేరుకుని ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో బుధవారం తెల్లవారుజామున మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా, నిరుపేద వర్గానికి చెందిన యాకయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


