ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్‌ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి పీహెచ్‌సీలో మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా డీఎంహెచ్‌ఓ హాజరై మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని మనం ఎప్పటి నుంచో వింటున్నామని, ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, కలుషిత ఆహారం, మానసిక ఒత్తిడి వల్ల అనేక కొత్త కొత్త రోగాలు వస్తున్నాయన్నారు. ఆరోగ్య అలవాట్లు ఆచరించాలని, వారంలో 5 రోజులు కనీసం 30 నుంచి 60 నిమిషాలు వ్యాయామం చేయాలని, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఆహారం, నీరు, గాలి కలుషితం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే మనం ఆసక్తి చూపుతామని, మానసిక, సామాజిక స్థితుల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని అన్నారు. విజ్ఞానానికి అండగా నిలుద్దామని, ఆరోగ్యం కోసం కలిసి పనిచేద్దామని, అపోహలు, మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాన్ని వీడి, శాసీ్త్రయ, వైద్య విజ్ఞానాన్ని నమ్మడం ద్వారానే ప్రజా రోగ్యం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ మాస్‌ మీడియా అధికారి ప్రసాద్‌, ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్‌ సుధీర్‌, ఆశా నోడల్‌ ఆఫీసర్‌ సక్కుబాయి, ఆరోగ్య విద్య బోధకులు కేవీ.రాజు, పురుషోత్తం, గీత, ఎంపీ హెచ్‌ఈఓ నరేశ్‌, సూపర్‌ వైజర్‌ సక్రి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement