● ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు కనీస మద్దతు ధర లేక, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ రవీందర్‌రావు మక్క రైతులకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్ స్నేహశబరీష్‌కు వినతి పత్రం అందజేశారు. మొక్కజొన్న కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని, మద్దతు ధర లభించేలా చూడాలని అన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, నాయకులు బానోతు రవి, జేర్రిపోతుల వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ యార్డు సందర్శన..
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును ఎమ్మెల్సీ రవీందర్ రావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు జరుగుతున్న అన్యాయం, సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు మొక్కజొన్నల కొనుగోళ్లను పరిశీలించామని తెలిపారు. మొక్కజొన్నలకు మద్దతు ధర లభించేలా చూసి, అన్నదాతలను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా మొండివైఖరి వీడి, ప్రతి గింజనూ మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు.


