టెన్త్‌ స్పాట్‌ కేంద్రంలో టీచర్ల నిరసన | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌ స్పాట్‌ కేంద్రంలో టీచర్ల నిరసన

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

విద్యారణ్యపురి: గతేడాదిలో టెన్త్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ చేసిన ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్‌ చెల్లించాలని, ప్రస్తుతం చేస్తున్న స్పాట్‌ మూల్యాంకన ధరలను 50 శాతం పెంపుదల చేయాలనే తదితర డిమాండ్లతో టీటీజాక్‌, యూఎస్‌పీసీ, జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు హనుమకొండ జిల్లా కేంద్రం ఫాతిమా హైస్కూల్‌లోని టెన్త్‌ స్పాట్‌ కేంద్రంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ 2024లో నిర్వహించిన కులగణనలో పాల్గొన్న ఉపాధ్యాయులకు పారి తోషికం ఇవ్వలేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కొన్నేళ్లుగా స్పాట్‌ మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు ఒకరోజు డీఏ తగ్గించి ఇస్తున్నారని ఆరోపించారు. ఆయా డిమాండ్లు పరిష్కరించకపోతే స్పాట్‌ మూల్యాంకన విధులు బహిష్కరిస్తారన్నారు. అనంతరం డీఈఓ, స్పాట్‌ క్యాంపు ఆఫీసర్‌ గిరిరాజ్‌ గౌడ్‌కు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఎం. తిరుపతిరెడ్డి, సి.హెచ్‌ రవీందర్‌ రాజు, కె. రాంబాబు, బి. రాజీబాపురావు, కె. శ్రీనివాసులు, గోవిందరావు, దేవేందర్‌రాజు, బద్దం సుదర్శన్‌రెడ్డి, రామాంజనేయులు, వి. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

గత వాల్యుయేషన్‌ రెమ్యునరేషన్‌

ఇవ్వాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement