● కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్‌లైన్‌లో చేపట్టబోతున్నామని, ఇది యూనివర్సిటీ చరిత్రలో మైలు రాయి అని వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం యూనివర్సిటీ ఆడిటోరియంలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులనుద్దేశించి వీసీ మాట్లాడారు. పారదర్శకతకు ఆన్‌లైన్ మూల్యాంకనం ఎంతో దోహద పడుతుందన్నారు. పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ మాట్లాడుతూ ఆన్‌లైన్ మూల్యాంకనంతో ఫలితాలను త్వరితగతిన విడుదల చేయొచ్చన్నా రు. రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ఓఎస్‌డీ బి. వెంకర టామ్‌రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య పాల్గొన్నారు. కాగా, ఆన్‌లైన్ మూల్యాంకన ప్రక్రియకు స్కాన్ చేసే సంస్థకు చెందిన ఎక్స్‌ఫర్ట్స్ డెమో ద్వారా ఎలా వాల్యుయేషన్ చేయాలో అధ్యాపకులకు వివరించారు.
వసూల్ రాజాలపై ఆరా
కాజీపేట అర్బన్: వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వసూల్ రాజాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈనెల 2, 3 తేదీల్లో ఏసీబీ దాడుల్లో డాక్యుమెంట్ రైటర్స్ నుంచి ఆన్‌లైన్‌లో యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులో రూ.42 లక్షలు చేతులు మారినట్లు తేలిపోయింది. కాగా, ఒక వ్యక్తి ఫోన్‌లో ఇంత మొత్తంలో లావాదేవీలు ఉంటే సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రైటర్లనే వసూల్ రాజాలుగా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఏసీబీ అధికారులు సదరు వసూల్ రాజాలు, అక్రమ రిజిస్ట్రేషన్ కింగ్‌లను పట్టుకునేందుకు వరంగల్ ఆర్‌ఓ కార్యాలయంలో మంగళవారం పరిశీలించేందుకు రాగా కొందరు డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలు తెరవకుండా పరారీలో ఉన్నట్లు తెలుసుకుని వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.


