వేయిస్తంభాల
ఆలయంలో
● సీతారామచంద్రస్వామి వారి కల్యాణ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం
హన్మకొండ కల్చరల్ : నగరంలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో శ్రీపరాభవ నామసంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం నిర్వహించిన ఉత్సవం వైభవంగా సాగింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పంచాంగశ్రవణం కవిసమ్మేళనంలో మాట్లాడుతూ ప్రజలకు నూతన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేశ్‌బాబు, దేవాలయ ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పాల్గొన్నారు.
అలరించిన కవిసమ్మేళనం..
కవిసమ్మేళనంలో కవితలు అలరించాయి. వల్సపై డి, తిరునగరి నరేందర్, మెరుగు అనురాధ, రామరత్నమాల, అరుణకీర్తిపతాక, తాండ్ర చిరంజీవి, వ హిద్‌గుల్షన్, బిటవరం శ్రీమన్నారాయణ తదితరులు చదివిన కవితలు అలరించాయి. అనంతరం క వులను సన్మానించారు. సేవాసమితి సభ్యులు చొల్లే టి కృష్ణమాచారి, సిబ్బంది మధుకర్ పాల్గొన్నారు.
ఉదయం 5గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభం
ఉదయం 5 గంటల నుంచి ఆలయప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూలగణపతికి ప్రత్యేక పూజలు, శ్రీరుద్రేశ్వరస్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు జరిపారు. విష్ణు ఆలయంలో హనుమాన్ లక్ష్మణ సమేత శ్రీసీతారాముల పంచలోహ విగ్రహాలను ప్రతిష్ఠించారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి అంకురారోపణ, కలశస్థాపన, పాంచారాత్ర ఆగమానుసారంగా ఋత్వికరణ, షోఢశోపచారపూజలు, కాళీకాపూజ మహా హారతి, మహానివేదన, ఉగాది పచ్చడి నివేదన చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కుటుంబసమేతంగా దేవాలయాన్ని సందర్శించి ఉత్సవాలను ప్రారంభించారు.
అలరించిన పంచాంగపఠనం,
కవి సమ్మేళనం


