● అంత్యక్రియలు పూర్తయిన వారం రోజుల తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని గంగాపూర్‌లో ఓ వ్యక్తి ఇటీవల మృతి చెందగా దీనిపై అనుమానం వ్యక్తం చేస్తూ అంత్యక్రియలు పూర్తయిన వారం రోజు లకు మృతదేహాన్ని బయటకు తీసి గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసుల కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన బందారం సురేశ్(40) భార్యాపిల్లలతో కలిసి హైదరాబా ద్‌లో ఉంటున్నాడు. ఈనెల 12న మృతి చెందగా స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే సురేశ్ మృతిపై అనుమానం ఉందని కుటుంబీకులు హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు గంగాపూర్‌లో సురేశ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పలు ఆధారాలను మెడికల్ కాలేజీ వైద్యులు తీసుకెళ్లారని, వాటి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జవహర్‌నగర్ ఎస్సై వేణు మాధవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ డాక్టర్ జక్కం సురేందర్, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఆర్‌ఐ వంశీకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
దేవరుప్పుల : కుటుంబంలో జరిగిన స్వల్ప గొడవతో మనస్తాపం చెందిన ఓ యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం చిప్పరాళ్లబండ తండాలో చోటుచేసుకుంది. ఎస్సై సృజన్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని కడవెండి రెవెన్యూ పరిధి చిప్పరాళ్లబండతండా గ్రామానికి చెందిన భూక్య శ్రీను(35)కు ధర్మాపురం పరిధి సీత్యతండాకు చెందిన రోజాతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో ఉగాది పండుగ రోజున ఆలస్యంగా ఎటో వెళ్లొచ్చిన భర్తను భార్య మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీను క్షణికావేశంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం వెంటనే హనుమకొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
70 క్వింటాళ్ల నల్లబెల్లం,
10 క్వింటాళ్ల పటిక పట్టివేత
● ముగ్గురు అరెస్ట్, లారీ సీజ్
కురవి: అక్రమంగా తరలిస్తున్న రూ.8లక్షల విలువైన 70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పటికను పట్టుకుని ముగ్గురి అరెస్ట్ చేయడంతోపాటు లారీని సీజ్ చేసినట్లు కురవి ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. గుడుంబా తయారీ కోసం ఏపీలోని చిత్తూరు నుంచి మహబూ బాబాద్ జిల్లా కేంద్రానికి తరలిస్తున్న నల్ల బెల్లం లారీని గురువారం కురవి శివారు సోమ్లతండా వద్ద మహబూబాబాద్ టాస్క్‌ఫోర్స్, కురవి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నట్లు చెప్పారు. అనంతరం నిందితులు గుగులోత్ సుమన్, ఆరెపల్లి మధు, బొల్లా విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సీఐ హతీరామ్, ఎస్సై తాహేర్‌బా బా, కురవి సెకండ్ ఎస్సై జయకుమార్, పీసీలు సమ్మయ్య, హరిబాబు, నరేశ్, భద్రు, బాబు, తదితరులు పాల్గొన్నారు.


