ఎండాకాలం.. బైక్‌ భద్రం | - | Sakshi
Sakshi News home page

ఎండాకాలం.. బైక్‌ భద్రం

Mar 20 2026 8:22 AM | Updated on Mar 20 2026 8:22 AM

బైక్‌ జాగ్రత్తలు ఇలా..

ఖిలా వరంగల్‌ : వేసవి వచ్చేసింది. రోజురోజుకూ భానుడు ప్రతాపం బెంబేలెత్తిస్తోంది. ఫలితంగా టే బుల్‌ ఫ్యాన్లు, విసన కర్రలను బయటకు తీయాల్సిన సమయం ఆసన్నమైంది. అంతేకాకుండా నెత్తి న టోపీ, భుజాలపై రుమాళ్లు పెట్టుకుని బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమంలో వేసవిలో ప్రచండ భానుడి ప్రతాపం నుంచి ఉపశమ నం పొందేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న మనం బైక్‌(ద్విచక్రవాహనాలు)ల విషయానికి వ చ్చేసరికి ఆశ్రద్ధ వహిస్తున్నాం. ఇది సరికాదు. మన ఆరోగ్య విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో అదే మాదిరి బైక్‌ల విషయంలోనూ అలాగే తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ వాహనాలు మరమ్మతుకు గురవడంతోపాటు మైలే జీ తగ్గనుంది. దీనికి ప్రధాన కారణం ఎండలో ఎక్కడపడితే అక్కడే నిలపడమే.

పార్కింగ్‌ స్థలాలు తక్కువ..

వరంగల్‌ ఉమ్మడి జిల్లాతోపాటు నగర వ్యాప్తంగా పార్కింగ్‌ స్థలాలు తక్కువ కనిస్తున్నాయి. ఫలితంగా వాహనాలను రోడ్డు పై పార్క్‌ చేయడం వల్ల టై ర్లు పంక్చర్‌ కావడంతో సకాలంలో గమ్యానికి చేరడం కష్టంగా ఉంటుంది. ఇంటి నుంచి ఆఫీస్‌, ఆఫీస్‌ నుంచి ఇంటికి, వ్యాపారులు షాపుల ఎదుట మండుటెండలో బైక్‌లు పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుండడంతోపాటు తరచూ మరమ్మతులకు గురవుతోంది. చివరకు మై లేజీ కూడా తగ్గిపోవడం, కలర్‌ షేడ్‌ కావడం, పెట్రో లు ఆవిరైపోవడం వంటివి ఉంటాయని మెకానిక్‌లు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రత 30 నుంచి 40 డిగ్రీలుపైబడి ఉంటోంది. ఈ నేపథ్యంలో బైక్‌ల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

వాహనం ఎండలో నిలిపారో పెట్రోల్‌ ఆవిరే..

ద్విచక్రవాహనాలకు తగ్గనున్న మైలేజీ

ఎండాకాలంలో వేడికి ఇంజిన్‌ ఆయిల్‌ త్వరగా పలుచబడుతుంది. ఈ నేపథ్యంలో నిర్ణీత సమయానికి ఇంజిన్‌ ఆయిల్‌ను మార్చుకోవడం మంచిది. వాహన ట్యాంకుపై మందం కవర్‌ ఉండేలా చూసుకోవాలి. సీట్ల కవర్లు సాధారణంగా ఉంటే త్వరగా వేడెక్కి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా వేడిగా వెలివేట్‌ క్లాత్‌ వంటి సీట్‌ కవర్‌ వాడాలి. ఎండలో ఎక్కువ సమయం పార్క్‌ చేస్తే బైక్‌లు దెబ్బతింటాయి. వేసవిలో బైక్‌పై దూరప్రయాణం చేయాల్సిన వారు మధ్య మధ్యలో ఆగి 15 నుంచి 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వలన ఇంజిన్‌ వేడి తగ్గుతుంది. వాహనాలను ఎక్కువ సమయం పార్క్‌ చేయాల్సి వస్తే చెట్టునీడన గాని షెడ్డల్లోగాని నిలపాలి. ఆధిక ఉష్ణోగ్రతతో టైర్లలో గాలి తగ్గిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement