అంతర్జాతీయ సదస్సుకు జితేందర్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ సదస్సుకు జితేందర్‌

Mar 5 2026 8:25 AM | Updated on Mar 5 2026 8:25 AM

కేయూ క్యాంపస్‌ : హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌కాలేజీ ఫిజిక్స్‌ విభాగం అధ్యాపకుడు, ఆ కళాశాల ప్లేస్‌మెంట్‌ సెల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎల్‌. జితేందర్‌కు అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. చైన్నెలోని ట్రేడ్‌కన్వెన్షన్‌ సెంటర్‌లో రీసెర్చ్‌ అండ్‌ అకాడమీ కాన్ఫరెన్స్‌ ఈనెల 4న ప్రారంభమై 7 వరకు కొనసాగనుంది. ఈ కాన్ఫరెన్స్‌లో జితేందర్‌ పాల్గొనబోతున్నారని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌. జ్యోతి బుధవారం తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌ ‘ఆన్‌ పౌడర్‌ మెటలర్జీ అండ్‌ పర్టిక్యూలర్‌ మెటీరియల్స్‌ ప్లస్‌ మెగా ఎగ్జిబిషన్‌’ అనే అంశంపై జరగనుంది. దేశవ్యాప్తంగా 50 ఇండస్ట్రీ సీఈఓలు, వివిద దేశాలనుంచి అనేక మంది రీసెర్చ్‌ అకాడమిస్టులు పాల్గొననున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొని తన పరిశోధన పత్రం సమర్పించడంతోపాటు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్లు జితేందర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement