పంట పరిరక్షణకు ‘జింక్‌’ | - | Sakshi
Sakshi News home page

పంట పరిరక్షణకు ‘జింక్‌’

Mar 5 2026 8:25 AM | Updated on Mar 5 2026 8:25 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : ఆధునిక వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు సాధించే దిశగా రైతులు ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఎ రువుల వినియోగం కీలకపాత్ర పోషిస్తుంది. మొక్కలు ఏపుగా పెరగడానికి ప్రధాన పోషకాలైన ఎన్‌, పీ, కేలతోపాటు సూక్ష్మ పోషకాలు జింక్‌, బోరాన్‌, ఐరన్‌, మాంగనీస్‌ కూడా చాలా అవసరం. ఈ పోషకాలను సమపాళ్లలో అందిస్తే అధిక దిగుబడులు పొందొచ్చు. ప్రస్తుత పంటల్లో చాలా వరకు సూక్ష్మఽ దాతు లోపాలను కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం సేంద్రియ ఎరువులు విస్మరించి రసాయనాలు అధికంగా వాడడం. యాసంగి పంటల్లో సా ధారణంగా చలి ప్రభావం ఉంటుంది. చలికాలంలో సూక్ష్మపోషకాలలో ముఖ్యమైన జింక్‌ అన్ని రకాల నేలల్లో ఉన్న పంటల్లో మొక్కలకు పోషకాలు సరిగా అందక లోప లక్షణాలు కనిపిస్తున్నాయి.

జింక్‌ ధాతు ఉపయోగాలు..

జింక్‌ ధాతువు పంట పెరుగుదల, దిగుబడిలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ జిల్లాల్లో చాలా వరకు జింక్‌లోపం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ మూలకం ఐరన్‌, మాంగనీస్‌తో కూడి పత్రహరితం తయారీలో తోడ్పడుతుంది.

ఈ మూలక లోపం..

మొక్కల ఎదుగులకు అవరోధం

ప్రస్తుతం చాలా పంటల్లో కనిపిస్తున్న సూక్ష్మధాతు లోపాలు

సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి

రైతులకు మల్యాల కేవీకే శాస్త్రవేత్త క్రాంతికుమార్‌ సలహాలు, సూచనలు

జింక్‌ ధాతు లోపంతో జరిగే నష్టాలు..

ఆకుల్లో మధ్య ఈనే పాలిపోతుంది.

ఆకుల పరిమాణం చిన్నగా మారుతాయి.

మొక్కలు గిడసబారి వరిలో దుబ్బు చేయవు.

కణుపుల మధ్య దూరం తగ్గుతుంది.

లేత దశలోనే ఆకులు రాలిపోతాయి.

వరిలో ఆకులు ఎండిపోయి పెలుసుగా మారుతాయి.

వేరుశనగలో ఆకులు చిన్నగా, గుబురుగా కనిపిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement