హన్మకొండ : జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా ప్రతీ విద్యుత్ ఉద్యోగి, సిబ్బంది కృషి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో లైన్‌మెన్ దివస్ నిర్వహించారు. కార్యాలయ ఆవరణలోని విద్యుత్ ఉద్యోగ అమరవీరుల స్తూపం వద్ద సీఎండీ, డైరెక్టర్లు పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. అనంతరం సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తూ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న లైన్‌మెన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. ప్రతీ ఉద్యోగి భద్రతాసూత్రాలు పాటించాలని, భద్రతే ముఖ్యమని చెప్పారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సి.ఈలు టి.తిరుమల్ రావు, కె.రాజు చౌహాన్, అశోక్, అన్నపూర్ణ, సురేందర్, మాధవ రావు, వెంకటరమణ, శ్రవణ్ కుమార్, సీజీఎంలు రవీంద్రనాథ్, చరణ్ దాస్, కిషన్, జాయింట్ సెక్రటరీలు కె.రమేశ్, శ్రీకృష్ణ, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎంలు హేమంత్ కుమార్, వేణు బాబు, గిరిధర్, నాగ ప్రసాద్, కళాధర్ రెడ్డి, జయరాజ్, శ్రీనివాస రావు, శ్రీనివాస్, వెంకటకృష్ణ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి


