జింక్ లోప సవరణకు జింక్ సల్ఫేట్ 20 కిలోలను ఎకరానికి లేదా 50 కిలోలు ఒక హెక్టార్‌కు వేసుకుని నేలలో కలియదున్నాలి. ఈ విధంగా ప్రతీ రెండు లేదా మూడు పంటలకు ఒకసారి వేసుకోవాలి. వేసుకునేటప్పుడు 200 నుంచి 250 కిలోల పశువుల పేడ, వర్మికంపోస్టుతో కలిపి 20 నుంచి 30 రోజుల పాటు గోనె సంచిలో ఉంచి మగ్గనిచ్చి ఆ తర్వాత వేసుకోవాలి. పైరుపై జింక్‌లోపం కనిపించగానే లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారి చేయాలి. జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురుగు/తెగుళ్ల మందులను కలపొద్దు. చౌడు నేలల్లో పిచికారీ తప్పనిసరి.
బి.క్రాంతికుమార్, శాస్త్రవేత్త,
మల్యాల కేవీకే, మహబూబాబాద్


