గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
విద్యారణ్యపురి: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని వరంగల్ నిట్ ప్రొఫెసర్ ఆనంద్ కిశోర్ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లైబ్రరీ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ ట్రాన్సర్మేషన్ ఇన్ అకాడమిక్ లైబ్రరీస్ నావిగేటింగ్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ సైన్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్‌రావు కీలకోపాన్యాసం చేస్తూ అత్యాధునికమైన డిజిటలైజేషన్‌ను పాఠకులకు మరింత చేరువచేయాలన్నారు. ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ సుదర్శన్‌రావు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మధుసూదన్, వరంగల్ నిట్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు మాట్లాడారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రమౌళి అధ్యక్షత వహించగా, సదస్సులో 75 పరిశోధన పత్రాలతో కూడిన సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు. కార్యకమంలో లైబ్రరీ సైన్స్ విభాగం అధిపతి యుగేందర్, అధ్యాపకులు సురేష్‌బాబు, అరుణ, సుజాత, మధు, శ్రీనివాస్, లక్ష్మీకాంతం, జ్యోతిర్మయి, లకన్‌సింగ్, సువర్ణ, రాజేశ్వరి తదతరులు పాల్గొన్నారు.
వరంగల్ నిట్ ప్రొఫెసర్ ఆనంద్‌కిశోర్


