సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ: సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు నడుపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వరంగల్ రీజియన్‌లో మొత్తం 650 ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ నెల 9 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులు కార్యాచరణ రూపొందించారు. ప్రధానంగా హనుమకొండ–హైదరాబాద్ ఉప్పల్ మధ్య ప్రత్యేక బస్సులు నడపనున్నారు. దీంతోపాటు నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, జనగామ, పరకాల, భూపాలపల్లి నుంచి కూడా ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా బస్సులు సమకూర్చి ట్రాఫిక్‌ను క్లియర్ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గమ్యస్థానాలకు చేరవేసేందుకు అధికారులు, సూపర్ వైజర్లు 24 గంటలపాటు బస్ స్టేషన్లలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్ బస్ పాయింట్ వద్ద ప్రయాణికుల కోసం తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేశారు. తాగు నీటి సౌకర్యం, ప బ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. తిరుగు ప్ర యాణం కోసం ఈ నెల 16 నుంచి 20 వరకు ప్రత్యే క బస్సులు నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లోను మహాలక్షి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది.
650 సర్వీసులు నడిపేలా ప్రణాళిక


