రైల్వే స్టేడియంలో ఖోఖో పోటీల ఏర్పాట్ల పరిశీలన
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్టేడియంలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే 58వ సీనియర్ జాతీయ ఖోఖో చాంపియన్‌షిప్–2026 పురుషులు, మహిళల టోర్నమెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లను గురువారం తెలంగాణ ఆయిల్ ఫెయిడ్ చైర్మన్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి పరిశీలించారు. రైల్వే స్టేడియంలో నిర్వహించే ఖోఖో పోటీలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి, వరంగల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్యామ్, తెలంగాణ రెఫరీ బోర్డు చైర్మన్ కె.సదానందం, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇన్‌స్టాలో వేధింపులు..
టెక్నాలజీతో అరెస్ట్
కాజీపేట అర్బన్: మడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ని భట్టుపల్లి గ్రామానికి చెందిన యువతిని ఇన్‌స్టా గ్రామ్‌లో వేధిస్తున్న అదే గ్రామానికి చెందిన వ్యక్తి పోలీసుల అడ్వాన్స్ టెక్నాలజీతో దొరికిపోయాడు. మడికొండ ఇన్‌స్పెక్టర్ కిషన్ గురువారం తెలిపిన వివరా ల ప్రకారం.. డిసెంబర్ 16వ తేదీన భట్టుపల్లి గ్రా మానికి చెందిన యువతి తనకు కాబోయే భర్తతోపా టు అతని స్నేహితులకు తన గురించి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపిస్తూ వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అడ్వాన్స్ టెక్నాలజీతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు భట్టుపల్లి గ్రామానికి చెందిన జక్కుల వంశీని నిందితుడిగా గుర్తించారు. కాగా వంశీ గతంలో యువతిని ప్రేమి స్తున్నానని వెంటపడడంతో నిరాకరించింది. దీంతో యువతికి కుదిరిన పెళ్లి సంబంధం చెడగొట్టేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తున్నా డు. నిందితుడు ముందస్తు జాగ్రత్తగా తన వైఫై నుంచి కాకుండా ఇతరుల వైఫై నుంచి మెసేజ్ చేసే వాడు. కానీ, పోలీసులు సాంకేతికతతో పట్టుకున్నా రు. కార్యక్రమంలో ఎస్సై రాజ్‌కుమార్, ఐటీ కోర్ ఎ స్సై సతీష్, ఏఏఓ సల్మాన్‌పాషా, సీసీపీఎస్ కానిస్టేబుల్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాలతో
భవిష్యత్ నాశనం
● డీసీపీ కవిత
హన్మకొండ: మాదక ద్రవ్యాలతో భవిష్యత్ నాశనం అవుతుందని వరంగల్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత అన్నారు. అనంతసాగర్‌లోని సుమతిరెడ్డి మహిళ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపా ల్ రాజశ్రీ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ‘మాదక ద్రవ్యాలు వినాశం చేస్తాయి.. సంస్కృతి చైతన్యాన్ని కలిగిస్తుంది..’ అనే నినాదంతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా హనుమకొండలో కళాశాల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కవిత మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని సమాజాన్ని నిశ్శబ్దంగా కుంగదీసే సమస్య అని అన్నారు. మత్తు పదార్ధాలు యువత భవిష్యత్‌ను ఆరోగ్యాన్ని, కు టుంబ జీవనాన్ని నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుమతి రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ రాజశ్రీ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాసంస్థలు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో విలువలు పెంపొందించాలని, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత అలవర్చుకునేల తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్, కళాశాల ఏఓ వేణుగోపాల స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు.
రైల్వే స్టేడియంలో ఖోఖో పోటీల ఏర్పాట్ల పరిశీలన
రైల్వే స్టేడియంలో ఖోఖో పోటీల ఏర్పాట్ల పరిశీలన
రైల్వే స్టేడియంలో ఖోఖో పోటీల ఏర్పాట్ల పరిశీలన


