వైద్యవిద్యార్థుల పరిశోధనలు పెరగాలి
ఎంజీఎం: వైద్యవిద్యార్థుల పరిశోధనలు పెరగాలని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రమేష్‌రెడ్డి అన్నారు. కాకతీయ మెడికల్ కాలే జీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అధ్యక్షతన ఎన్‌ఆర్‌ఐ పూర్వ విద్యార్థులు డాక్టర్ సుజిత్, డాక్టర్ వేణు, డాక్ట ర్ అనుపమల నేతృత్వంలో నిర్వహిస్తున్న క్రితి 3.0 ఈవెంట్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడు తూ.. వైద్య విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటీ స్థాయిలో పరిశోధన కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చా రు. అనంతరం వీసీ డాక్టర్ రమేష్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య సుంకరనేని, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి, బోధన సిబ్బంది, నిర్వాహకులు కలిసి విద్యార్థులు ఏర్పాటు చేసిన మెడ్ ఎక్స్‌పోను సందర్శించారు. ఈవెంట్ మొదటి రోజు పేపర్ ప్రెజెంటేషన్లు, సర్జికల్ స్కిల్స్ వర్క్‌షాప్, జియోపార్డీ, మెడ్ ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు. నేడు (శుక్రవారం) సింపోజియం, పోస్టర్ ప్రెజెంటేషన్లు, సీఎంఈ ప్రసంగాలు, సర్జికల్ స్కిల్స్ వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కాళోజీ యూనివర్సిటీ వీసీ రమేష్ రెడ్డి
వైద్యవిద్యార్థుల పరిశోధనలు పెరగాలి


