క్రీడలతో మానసికోల్లాసం
ఏటూరునాగారం: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని కొమురం భీం మినీస్టేడియంలో కొనసాగుతోన్న తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ 6వ రాష్ట్రస్థాయి క్రీడలకు గురువారం డీడీ జనార్ధన్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అండర్ –14, అండర్–17 విభాగాలకు చెందిన బాలిబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, చెస్, క్యారమ్స్, ఆర్చరీ, అథ్లెటిక్స్ తదితర క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మూడు ఐటీడీఏలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 1,500 మంది గిరిజన బాలబాలికలు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. నేడు ఫైనల్స్ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పీడీలు ఆదినారాయణ, శ్యామలత, కిట్టు, ఉపాధ్యాయుడు మైపతి సంతోష్, నల్లబో యిన కోటయ్య, బానోతు శ్రీనివాస్, పీఈటీలు పాల్గొన్నారు.
విజేతల గెలుపు ఇలా..
● వాలీబాల్ అండర్ –14 బాలుర భద్రాచలం జట్టుపై ఏటూరునాగారం జట్టు విజయం సాధించింది.
● వాలీబాల్ అండర్ –17 బాలుర విభాగంలో ఉట్నూరు 2 జట్టుపై ఉట్నూరు 1 జట్టు విజయం పొందింది.
● ఖోఖో అండన్ –17 విభాగంలో బాలుర ప్లేన్ ఏరియా 2పై భద్రాచలం జట్టు విజయం సాధించగా బాలికలు ప్లేన్ ఏరియా 1 పై ఉట్నూరు 1 గెలిచింది.
● అథ్లెటిక్స్‌లో షాట్‌ఫుట్‌లో మొదటి బహుమతి ఉట్నూరు జోన్ 1 నుంచి ఇంద్రాబాబు, రెండో బహుమతి ఉమేష్ భద్రాచలం గెలుపొందారు.
పరుగు పందెం
● వంద మీటర్ల పరుగు పందెంలో అండర్ –17 విభాగంలో ఉట్నూర్ 1కు చెందిన ఇంద్రాబాబు మొదటి బహుమతి దక్కించుకున్నాడు. రెండో బహుమతి లోకేష్ (భద్రాచలం), మూడో బహుమతి మనోజ్ (ఉట్నూరు) గెలుపొందారు.
● వంద మీటర్లు అండర్ –17 బాలికల విభాగంలో బి.నవ్యశ్రీ(ఏటూరునాగారంజోన్), శైలజ (ఉట్నూరు) రెండో స్థానం, మూడో స్థానం శృతి హాసన్ (భద్రాచలం జోన్) గెలుపొందారు.
● చెస్‌లో అండర్ –14 బాలికల విభాగంలో లహరిక (ఏటూరునాగారంజోన్), నందిని (ఊట్నూరు 1), విమల (ఉట్నూరు 1) గెలుపొందారు.
డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్
కొనసాగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడలు
క్రీడలతో మానసికోల్లాసం


