ఆదివాసీ సంప్రదాయాలకు అద్దం పట్టాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించాలని సీఎంఓ ప్రిన్సిపా ల్ సెక్రటరీ శ్రీనివాసరాజు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గద్దెల పునఃప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. గురువారం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్‌లో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్‌తో కలిసి ఆయన అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షి నిర్వహించారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుందని, సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ దివాకర్ వివరించారు. రహదారులు, పార్కింగ్ సెల్‌ఫోన్ నెట్‌వర్క్, భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మేడారంలో నాలుగు రోజులపాటు జరిగే జాతర ఉత్సవాల్లో అమ్మవార్ల పూజ కార్యక్రమాల ను వివరించారు. జాతర పరిసరాలను 8 జోన్లుగా విభజించామని, ప్రతి జోన్‌లో 8 మంది అధికారులు ఉంటారని, 42 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అదేశించారు. పార్కింగ్‌కు సంబంధించిన సమాచారం భక్తులకు సులభంగా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, ఈఓ వీరస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎంఓ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీనివాసరాజు
మేడారం జాతర నిర్వహణపై సమీక్ష


