నేల ఆరోగ్యంతోనే రైతులు బాగు
● ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ ఉమారెడ్డి
హన్మకొండ: నేల ఆరోగ్యంతోనే రైతులు బాగుంటారని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమారెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జాతీ య రైతు దినోత్సవం నిర్వహించారు. దేశ మాజీ ప్రధాని చరణ్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఈ క్రమంలో రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవాలన్నారు. అలాగే, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతుల శ్రేయస్సు కోసం చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిచారు. కార్యక్రమంలో మధ్య తెలంగాణ మండలంలోని రైతు విజ్ఞాన కేంద్రాలైన వరంగల్, జోగిపేట, తోర్నాల కోఆర్డినేటర్లు డాక్టర్ ఎ.విజయభాస్కర్, డాక్టర్ కె.రాహుల్, డాక్టర్ పల్లవి, శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ విద్యార్థులు పాల్గొన్నారు.


