వ్యక్తి దారుణ హత్య!
కేసముద్రం: ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచాతండాజీపీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భుక్య వీరన్న(45) కౌలు వ్యవసాయంతోపాటు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఫోన్ రావడంతో తాను బయటకు వెళ్లొస్తానని భార్య విజయకు చెప్పి బైక్‌పై వెళ్లాడు. అర్ధర్రాతి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఇంటికి తిరిగొచ్చారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున తండాకు చెందిన ఓ వ్యక్తి తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్తుండగా ప్రధాన రహదారి పక్కన వీరన్న మృతి చెంది ఉండడాన్ని గమనించి కుటుంబీకులు, పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్, సెకండ్ ఎస్సై నరేశ్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తల వెనుకవైపు ఆయుధంతో కొట్టినట్లు గాయం ఉండడంతోపాటు మృతదేహానికి కొంత దూరంలోని వ్యవసాయ భూమిలో రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మృతదేహాన్ని మరోచోటు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పడేసినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు మృతదేహంపై బైక్ ఉండడంతో రోడ్డు ప్రమాదంగా దుండగులు చిత్రీకరించినట్లు పలువురు భావిస్తున్నారు. అనంతరం క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, బయటకు వెళ్లొస్తానని రాత్రి ఇంచి నుంచి వెళ్లిన వీరన్న.. తెల్లవారుజామున శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడి తల్లి రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.
నిందితుడి అరెస్ట్
నెల్లికుదురు : లైంగికదాడి ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు కేసముద్రం సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఇనుగుర్తి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై కరుణాకర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామంలో ఓ వివాహితపై ఈ నెల 22న గ్రామంలోని ఓ రైస్ మిల్లులో కూలి పనిచేస్తున్న బిహార్‌కు చెందిన అంకల్ మాంజి లైంగికదాడికి పాల్పడినట్లు రుజువైందని తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
● ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం?
● బోడమంచాతండాజీపీలో ఘటన
వ్యక్తి దారుణ హత్య!


