పటేల్‌గూడెంలో 4 ఓట్ల తేడాతో గెలుపు
లింగాలఘణపురం: మండలంలోని పటేల్‌గూడెంలో గురువారం జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో కేవలం 4 ఓట్ల తేడాతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పొన్నాల బుచ్చయ్య గెలుపొందారు. పటేల్‌గూడెంలో 1,347 ఓట్లకు గాను 1,271 ఓట్లు పోలయ్యాయి. అందులో పొన్నాల బుచ్చయ్యకు 610 ఓట్లు రాగా బీఆర్‌ఎస్ బలపరిచిన కడుదూరి సోమిరెడ్డికి 606 ఓట్లు, బీజేపీ బలపరిచిన అభ్యర్థి కార్తీక్‌కు 36, చెల్లని ఓట్లు 17, నోటాకు 2 వచ్చాయి. దీంతో బుచ్చయ్యకు సోమిరెడ్డి కంటే 4 ఓట్లు ఎక్కువ రావడంతో రెండోసారి కౌంటింగ్ చేశారు. తేడా రాకపోవడంతో అధికారులు గెలిచినట్లు ప్రకటించారు.


