సంతోషం పట్టలేక సొమ్మసిల్లి..
● విజేతగా ప్రకటించగానే స్పృహతప్పిన
వార్డు సభ్యురాలు
ఏటూరునాగారం: ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ 8వార్డు సభ్యురాలు అమీనాబేగం గెలుపొందినట్లు అధికారులు ప్రకటించడంతో సంతోషం పట్టలేక సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన బీఆర్‌ఎస్ నాయకుడు లక్ష్మణ్‌బాబు హుటాహుటిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


