నాడు జెడ్పీటీసీ.. నేడు సర్పంచ్
● బండాతండా సర్పంచ్‌గా
అరుణశ్రీ అల్వార్
జఫర్‌గఢ్: 2014 నుంచి 2019 వరకు జఫర్‌గఢ్ జెడ్పీటీసీగా పని చేసిన బానోత్ అరుణశ్రీ అల్వార్ బండాతండా నుంచి సర్పంచ్‌గా గెలుపొందారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం అల్వార్‌బండాతండా (శంకర్‌తండా) జీపీ సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన అరుణశ్రీ తన సమీప అభ్యర్థి బానోత్ మంక్తిపై 85 ఓట్లతో విజయం సాధించింది. కాగా, బానోత్ అరుణశ్రీ అత్త తులసీ తాజా మాజీ సర్పంచ్‌గా పని చేశారు. మళ్లీ ఇదే గ్రామపంచాయతీ నుంచి సర్పంచ్‌గా తన కోడలు అరుణశ్రీ విజయం సాధించారు.


