మొదటి విడత హస్తగతం
సాక్షి, మహబూబాబాద్: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పోటాపోటీగా సాగింది. గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌లో అన్ని పార్టీల మద్దతుదారులు తమ అనుకూలమైన వారిని తీసుకొచ్చి ఓట్లు వేయి ంచారు. మధ్యాహ్నం తర్వాత జరిగిన ఓట్ల లెక్కింపులో కొన్ని చోట్ల వార్ వన్‌సైడ్ కాగా.. మరికొన్ని గ్రామాల్లో చివరి వరకు నువ్వా.. నేనా అన్నట్లు ఓ ట్లు పడ్డాయి. తక్కువ మెజార్టీతో గెలిచిన స్థానాల్లో రీపోలింగ్ నిర్వహించారు. కాగా, గెలిచిన వారు సంబురాలు చేసుకోగా.. ఓడిపోయిన వారిలో కొందరు ఓట్లు వేయలేదని తిట్ల దండకం మొదలుపెట్టారు.
నువ్వా.. నేనా..
జిల్లాలోని ఐదు మండలాల్లో పలుచోట్ల పోటాపోటీగా ఓట్లు పడడంతో చివరి వరకు నువ్వా.. నేనా అన్నట్లు ఓట్ల లెక్కింపు జరిగింది. మహబూబాబాద్ మండలంలోని ఎమ్మెల్యే మురళీనాయక్ సొంత గ్రామం సోమ్లాతండాలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఇస్లావత్ సుజాతకు మెజార్టీ వచ్చింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి భూక్య కౌసల్య రీకౌంటింగ్ కోరగా మరోసారి ఓట్ల లెక్కించి రెబల్ అభ్యర్థినే విజేతగా ప్రకటించారు. జంగిలిగొండ పంచా యతీలో బీఆర్‌ఎస్ మద్దతుదారు జక్క మమత ముందుగా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ మద్దతుదారు గుండెల రేణుక రీకౌంటింగ్‌కు వెళ్లారు. ఓట్ల లెక్కింపు తర్వాత రేణుక గెలిచినట్లు ప్రకటించారు. కంబాలపల్లి పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు చీరిక వసంత గెలిచినట్లు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి స్వర్ణలత రీకౌంటింగ్‌కు వెళ్లారు. మళ్లీ ఓట్లు లెక్కించినా వసంతనే గెలిచినట్లు ప్రకటించారు. ముడుపుగల్లులో కాంగ్రెస్ మద్దతుదారు కొత్త హే మంత్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. బీఆర్‌ఎస్ మద్దతుదారు జేరిపోతుల వెంకన్న రీకౌంటింగ్‌కు వెళ్లారు. తర్వాత ఓట్లు లెక్కించినా హేమంత్‌కే మెజార్టీ వచ్చినట్లు ప్రకటించారు. దామరవంచలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతు అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. చివరకు కాంగ్రెస్ మద్దతుదారు ఒక్క ఓటుతో గెలిచినట్లు ప్రకటించారు.
కాంగ్రెస్‌కు రెబల్ దెబ్బ..
మొదటి విడత పోటీలో కాంగ్రెస్‌కు ఇంటిపోరు మొదలైంది. దీంతో కొంత మందికి టికెట్ ఇవ్వలేదు. దీనిపై నిరసర తెలుపుతూ పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెబల్ అభ్యర్థులుగా పోటీ చే శారు. ఇందులో మహబూబాబాద్ మండలంలో సోమ్లాతండా, దర్గాతండా, సింగారం శివా రు ఇస్లావత్ తండాలో రెబల్ అభ్యర్థులు గెలి చారు. ఇనుగుర్తి మండలంలో ఒకరు, కేసుముద్రంలో ఇద్దరు, నెల్లికుదురు మండలంలో ఇద్దరు రెబల్ అభ్యర్థులు గెలిచారు. గూడూరు మండలంలో ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల పేరుతో అభ్యర్థులు పోటీ చేయగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో రెబల్‌గా పోటీ చేసిన ఐదుగురు గెలిచారు.
పార్టీల వారీగా మద్దతు దారులు గెలుపొందిన అభ్యర్థుల వివరాలు
అత్యధిక స్థానాలు కై వసం చేసుకున్న
కాంగ్రెస్ మద్దతుదారులు
వేం నరేందర్ రెడ్డి సొంత గ్రామంలో హస్తం హవా
మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఊరిలో కాంగ్రెస్ ఓటమి
నువ్వా నేనా అన్నట్లు సాగిన ఓట్ల లెక్కింపు
రీ కౌంటింగ్‌తో బయటపడ్డ
హజార్యాతండా సర్పంచ్
ఎన్నికల మరిన్ని వార్తలు
మండలం కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు ఏకగ్రీవం మొత్తం
మహబూబాబాద్ 23 11 01 04 02 41
కేసముద్రం 13 11 00 02 03 29
నెల్లికుదురు 17 09 02 02 01 31
గూడూరు 21 12 02 05 01 41
ఇనుగుర్తి 06 04 00 01 02 13
మొత్తం 80 47 05 14 09 155
మొదటి విడత హస్తగతం
మొదటి విడత హస్తగతం


