పోలింగ్ ప్రశాంతం
మహబూబాబాద్: జిల్లాలో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిగింది. కాగా ఉదయం మందకొడిగా ప్రారంభమై.. 9గంటల తర్వాత ఓటర్లు బారలుదీరడంతో ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. కాగా జిల్లాలోని ఐదు మండలాల్లో 86.99శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
146 జీపీలు, 1072 వార్డుల్లో పోలింగ్..
జిల్లాలోని గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మానుకోట, నెల్లికుదురు మండలాల్లో మొదటి విడత పోలింగ్ జరిగింది. ఆయా మండలాల్లో 155 గ్రామపంచాయతీలు ఉండగా.. 9 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 1,338 వార్డులకు 266 ఏకగ్రీవమయ్యాయి. కాగా, మిగిలిన 146 జీపీలు, 1,072 వార్డుల్లో పోలింగ్ జరిగింది.
86.99 శాతం నమోదు..
ఉదయం 7నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించారు. సమయం ముగిసిన తర్వాత క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం చలి తీవ్రతతో ఓటర్లు పెద్దగా బయటకు రాలేదు. ఆతర్వాత బారులు దీరడంతో ఓటింగ్‌శాతం పెరిగింది. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్లు ఏర్పాటు చేశారు.
పురుష ఓటర్లదే పైచేయి
మొత్తం 1,72,218మంది ఓటర్లు ఉండగా.. వారిలో 84,927 మంది పురుష ఓటర్లు, 87,282 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 9మంది ఉన్నారు. మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. 84,927 మంది పురుష ఓటర్లలో 74099 మంది ఓటేశారు. అలాగే 87,282మంది మహిళా ఓటర్లలో 75,712మంది ఓటేశారు. పురుష ఓటర్ల పోలింగ్ 87.25శాతం, మహిళ ఓటర్ల పోలింగ్ 86.744 శాతం నమోదైంది.
86.99 శాతం నమోదు
ఐదు మండలాల్లో 1,72,218 ఓట్లకు 1,49,812ఓట్లు పోలింగ్
క్యూలో బారులుదీరిన ఓటర్లు
ఉదయం 7నుంచి 9 గంటల వరకు మందకొడిగా ఓటింగ్
9 తర్వాత పుంజుకున్న వేగం
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం
పోలింగ్ ప్రశాంతం


