ఎన్నికల పరిశీలకుడి సందర్శన | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల పరిశీలకుడి సందర్శన

Dec 12 2025 10:06 AM | Updated on Dec 12 2025 10:06 AM

ఎన్ని

ఎన్నికల పరిశీలకుడి సందర్శన

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలంలోని అమనగల్‌ గ్రామంలో జరుగుతున్న జీపీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను ఎన్నికల వ్యయ పరిశీలకుడు మధుకర్‌ బాబు గురువారం సందర్శించి పరిశీలించారు. ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ ద్వారా జీపీ ఎన్నికలు జరుగుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీనియర్‌ అసిస్టెంట్‌ కృష్ణప్రసాద్‌ ఉన్నారు.

బోణీ కొట్టిన బీజేపీ

మహబూబాబాద్‌ రూరల్‌ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మహబూబాబాద్‌ మండలంలో బోణీ కొట్టింది. మండలంలోని నడివాడ గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో పెదగాని గుట్టయ్య, కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో రాగిపాటి బుచ్చిరెడ్డి, బీజేపీ మద్దతుతో మైదం విజయకుమార్‌ సర్పంచ్‌ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ నెల 9న ఉదయం కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారు సర్పంచ్‌ అభ్యర్థి రాగిపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం జరిగిన జీపీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేసిన మైదం విజయకుమార్‌ 404 ఓట్లు కై వసం చేసుకుని విజయం సాధించారు. పెదగాని గుట్టయ్యకు 306 ఓట్లు రాగా మృతుడు రాగిపాటి బుచ్చిరెడ్డికి 160ఓట్లు వచ్చాయి.

విద్యార్థులను

ఉన్నతంగా తీర్చిదిద్దాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర అకాడమిక్‌ అడిట్‌ పరిశీలకుడు డాక్టర్‌ బి.రాములు అన్నా రు. జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం 2022 –23, 2023–24 విద్యాసంవత్సరాల ఆడిట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. కళాశాలకు న్యాక్‌ గుర్తింపులో భాగంగా ఏ–గ్రేడ్‌ సాధించేందుకు అధ్యాపకులు అన్ని రకాల రికార్డులను తయారు చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ బి. లక్ష్మణ్‌నాయక్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు, అధ్యాపకులు అనిల్‌కుమార్‌, మసూద్‌ఆహ్మద్‌, రాజశేఖర్‌, అన్నపూర్ణ, వినోద్‌, హతీరాం, ఉపేందర్‌, సుమలత, సాంబశివరావు, కాసీం, సుమన్‌, వీరు, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

‘సీకేఎం’లో అస్తవ్యస్త పాలన

పూర్తి కాని టెండర్‌ ప్రక్రియ

మెరుగు పడని సేవలు

ఇబ్బందులు పడుతున్న రోగులు

ఎంజీఎం: సీకేఎం ఆస్పత్రిలో పాలన రోజురోజుకూ ఆస్తవ్యస్తంగా మారుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ పాలనపై పరిపాలనాధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయి. వరంగల్‌ సీకేఎం ఆస్పత్రికి ఉమ్మడి వరంగల్‌ జిల్లాల నుంచే కాకుండా.. ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ప్రసవ చికిత్సలు పొందుతుంటారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలతో పాటు పారిశుద్ధ్యం, భోజన సౌకర్యాలు కల్పించాలి. ఈక్రమంలో సెక్యూరిటీ, శానిటేషన్‌ టెండర్‌ ప్రక్రియ రాష్ట్ర పరిధిలో ఉండగా, రోగులకు భోజనం అందించే డైట్‌ టెండర్‌ జిల్లా పరిధిలో ఉంటుంది. వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద స్వయంగా డైట్‌ను పరిశీలించిన సమయంలో టెండర్‌ను రెన్యూవల్‌ చేయకుండా నూతన టెండర్‌ పిలవాలని ఆదేశించారు. ఏప్రిల్‌లో డైట్‌ టెండర్‌ పిలిచారు. ఇందులో భాగంగా పలువురు కాంట్రాక్టర్లు టెండర్‌లో పాల్గొని ఈఎండీలు సైతం చెల్లించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కాంట్రాక్టర్‌ టెండర్‌ ప్రక్రియలో ఉన్న చిన్నపాటి తప్పిదాలతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు టెండర్‌ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. ఈ టెండర్‌ ప్రక్రియలో పాల్గొన్న కాంట్రాక్టర్లకు 8 నెలలుగా ఈఎండీలు చెల్లించకపోవడంతో పాటు కోర్టులో సమస్యను పరిష్కరించడంలో పరిపాలనాధికారులు విలఫమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఎన్నికల పరిశీలకుడి సందర్శన
1
1/3

ఎన్నికల పరిశీలకుడి సందర్శన

ఎన్నికల పరిశీలకుడి సందర్శన
2
2/3

ఎన్నికల పరిశీలకుడి సందర్శన

ఎన్నికల పరిశీలకుడి సందర్శన
3
3/3

ఎన్నికల పరిశీలకుడి సందర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement