గుర్తుల కేటాయింపు ఉల్టా పల్టా..
కొత్తగూడ: గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు కేటాయించాల్సిన గుర్తులను అధికారులు ఉల్టా పల్టా చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రామన్నగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఒకటో అభ్యర్థికి ఉంగరం, రెండో అభ్యర్థికి కత్తెర, మూడో అభ్యర్థికి బ్యాట్ కేటాయించాల్సి ఉంది. కాగా, అధికారులు ఒకటో అభ్యర్థికి బ్యాట్, రెండో అభ్యర్థికి ఉంగరం, మూడో అభ్యర్థికి కత్తెర కేటాయిస్తూ నోటీసు బోర్డులో అంటించారు. దీంతో వరుస నంబర్లలో గందరగోళం ఏర్పడింది. ఎన్నికలు పూర్తయిన తర్వాత అభ్యర్థులు తమ ఓటమికి అధికారులు కేటాయించిన గుర్తులే కారణం అని, కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంటనే చర్చ సాగుతోంది. 20 ఏళ్ల క్రితం మడగూడెం గ్రామపంచాయతీలో గుర్తు మార్పు వల్ల రీ పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. ఈవిషయమై ఎంపీడీఓ మున్వర్‌ను వివరణ కోరగా గుర్తుల కేటాయింపులో ఎలాంటి సమస్య లేదని.. నోటీసు బోర్డులో తప్పుగా రాశారన్నారు. దాన్ని సరి చేసినట్లు వివరణ ఇచ్చారు.
అధికారులు
కేటాయించిన గుర్తులు
నిర్దేశించిన గుర్తుల కేటాయింపు విధానం
గుర్తుల కేటాయింపు ఉల్టా పల్టా..


