పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ
కేసముద్రం: మండలంలోని పెనుగొండ గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ శబరీష్ సందర్శించి, పరిశీలించారు. పోలీసు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని సూచించారు.
గూడూరులో..
గూడూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ శబరీష్ సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై గిరిధర్‌రెడ్డి మండల వ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ ఎస్సై గిరిధర్‌రెడ్డి ద్వారా మండల వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల సరళిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాలన్నీ గస్తీ తిరుగుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేలా, సంబురాల సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సైకి సూచించారు.


