సర్పంచ్ అభ్యర్థుల పాట్లు
● కాళ్లు మొక్కి.. మంచంపై తీసుకువచ్చి.. ఓట్లు వేయించి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని రేగడి తండా, ఉత్తర తండా గ్రామపంచాయతీలో పరిధిలో వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు, నడవలేని వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావాడానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడ్డారు.
స్థానికులు, సర్పంచ్ అభ్యర్థుల వారిని మంచాలపై వాహనాల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకుని వచ్చి ఓట్లు వేయించిన అనంతరం మళ్లీ వారిని ఇంటి వద్ద దింపారు. ఆమనగల్ గ్రామంలో జీపీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఓటర్లను కాళ్లు పట్టుకుని మొక్కుతూ తమకు ఓట్లు వేయాలని ప్రాధేయపడ్డారు.


