పోలింగ్ టు కౌంటింగ్
జనగామ/సంగెం : ఉమ్మడి వరంగల్‌జ ఇల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలివిడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకుని పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పో లింగ్‌నుంచి లెక్కింపు, విజేతల ప్రకటన వరకు పాటించాల్సి న నియమ నిబంధనల మార్గదర్శకాలకు ఎన్నికల సంఘం విడుదల చేసింది. అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి.
పోలింగ్ ఏజెంట్ల కూర్చునే విధానం
కేంద్రంలో పోలింగ్ ప్రారంభానికి ముందే ఏజెంట్లు కూర్చునే విధానంపై అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఓటర్ల ముఖాలను గుర్తుపట్టే విధంగా, పోలింగ్ ఏజెంట్ల వెసులుబాటును బట్టి పోలింగ్ అధికారుల వెనుక కూర్చోబెట్టాలి. ఇది సాధ్యం కాని పరిస్థితుల్లో అధికారుల ఎదురుగా సీట్లు ఏర్పాటు చేయవచ్చని ఎన్నికల నిబంధనల్లో స్పష్టం చేశారు. స్టేషన్‌లో ఏజెంట్లకు తిరగడాటానికి అనుమతి ఉండదని, నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన
● ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఒంటి గంట వరకు ఆవరణలో ఉన్న ఓటర్లతో ఓటింగ్ నిర్వహిస్తారు. భోజనం అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
● ఓటింగ్ హాల్‌లో లోపల ఉన్న ప్రతీవ్యక్తి చట్టపరంగా ఓటింగ్ రహస్యాన్ని కాపాడి, అందుకు సహకరించాలి. ఉల్లంఘించిన వారికి అధికారులు 3 నెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తారు.
● పోలింగ్ బాక్స్‌లోని వార్డు సభ్యుల తెలుపు, సర్పంచ్ గులాబీ రంగు బ్యాలెట్లను బయటకు తీసి వేర్వేరుగా ఉంచుతారు. ముందుగా వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాల లెక్కింపు పూర్తైన తర్వాత సర్పంచ్ బ్యాలెట్ పత్రాలు లెక్కిస్తారు.
● బ్యాలెట్ అకౌంట్ నమోదు, లెక్కించిన పత్రాల సంఖ్య, జారీ చేసిన పత్రాల మధ్య వ్యత్యాసముంటే ప్రత్యేకంగా నమోదు చేయాల్సి ఉంది. అత్యవసర పరిస్థితులు తలెత్తితే బ్యాలెట్ పత్రాలు, సంబంధిత రికార్డులను రిటర్నింగ్ అధికారి సీల్‌తో పాటు అభ్యర్థుల ఏజెంట్ల సీల్ వేసి భద్రపర్చాలి.
● ఫలితాలు సమానంగా వచ్చిప్పుడు లాటరీ ద్వారా తుది తీర్పు వెల్లడిస్తారు.
● అనంతరం గెలిచిన అభ్యర్థులకు ధ్రువపత్రాలను అధికారులు అందజేస్తారు.
ఎన్నికల వాయిదా, రద్దు
జనగామ: ఎన్నికల సందర్భంగా ఏదైనా పోలింగ్ బూత్‌ను గుంపులుగా కొంతమంది ఆక్రమించడం, అక్కడ జరిగిన పోలింగ్ ఫలితాన్ని నమ్మదగిన విధంగా నిర్ధారించలేని పరిస్థితి ఏర్పడడం, లేదా ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆక్రమించి లెక్కింపు ప్రక్రియలో అలజడిగా మార్చిన క్రమంలో రిటర్నింగ్ అధికారి వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు నివేదిక అందించాలి. నివేదిక పరిశీలించిన సదరు కమిషనర్.. పరిస్థితులను బేరీజు వేస్తారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో జరిగిన ఓటింగ్ చెల్లనిదిగా ప్రకటించి, కొత్త తేదీని నిర్ణయించి రీపోలింగ్ ఆదేశాలు జారీ చేస్తారు.
ఉప సర్పంచ్ ఎన్నిక నిబంధనలు
గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలి. రిటర్నింగ్ అధికారి ప్రకటించిన ఫలితాల అనంతరం ఆయన నోటీసులో పేర్కొన్న తేదీ, సమయం, స్థలంలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉపసర్పంచ్ ఎన్నుకోవాలి. నిర్ణయించిన రోజు సమావేశం ఏదైనా కారణాలతో జరగకుంటే మరుసటి రోజు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారిపై ఉంటుంది. సమావేశ ప్రారంభ సమయం నుంచి గంటలోపు సర్పంచ్‌తో కలిపి మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది హాజరైనప్పుడే ఎన్నిక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 2018 తెలంగాణ పంచాయతీ రాజ్ నియమావళి ప్రకారం సమావేశానికి రిటర్నింగ్ అధికారి అధ్యక్షత వహించి ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నిక అనంతరం ఉప సర్పంచ్‌గా ఎన్నికై న వ్యక్తి పేరును గ్రామపంచాయతీ నోటీసు బోర్డుపై ప్రకటిస్తూ రిటర్నింగ్ అధికారి నోటీసు విడుదల చేస్తారు. ఆ నోటీసు ప్రతిని ఎన్నికై న అభ్యర్థికి కూడా అందజేస్తారు.
డిపాజిట్ గల్లంతు అంటే?
ఎన్నికల్లో అభ్యర్థి డిపాజిట్ గల్లంతు అయిందని వార్తలు మనం వింటుంటాం. అసలు డిపాజిట్ దక్కడం అంటే ఏమిటో తెలుసుకుందాం. పోటీలో ఉన్న అభ్యర్థి మొత్తం పోలైన ఓట్లలో 16 శాతం లేదా అంతకుమించి ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఇలా సాధిస్తేనే అభ్యర్థికి డిపాజిట్ దక్కినట్లు. ఉదాహరణకు ఒక గ్రామంలో వెయ్యి ఓట్లు పోలైతే ఒక అభ్యర్థి 160 లేదా అంతకుమించి ఓట్లు సాధించాలి. ఒకవేళ దానికన్నా తక్కువ ఓట్లు సాధిస్తే సదరు అభ్యర్థి డిపాజిట్ కోల్పోయినట్లు పేర్కొంటారు. డిపాజిట్ దక్కిన అభ్యర్థికి నామినేషన్ సమయంలో జమచేసిన డిపాజిట్ డబ్బులను తిరిగి ఇస్తారు. డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థుల డబ్బులు ఎన్నికల కమిషన్ ఖాతాలోకి వెళ్తాయి.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల
ప్రకారమే ఎన్నికలు
నేడు గ్రామ పంచాయతీ తొలి విడత పోలింగ్
సాయంత్రమే లెక్కింపు.. విజేతల ప్రకటన
పోలింగ్ టు కౌంటింగ్


