వదిన – మరిది మధ్య సవాల్
ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రం
కోతులను పట్టిస్తాం.. ఓట్లు కొట్టేస్తాం
కురవి: మండలంలోని కంచర్లగూడెం గ్రామ సర్పంచ్ స్థానానికి వదిన – మరిది మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన మూడ్ రజిత పోటీ చేస్తుండగా, ఆమె సమీప బంధువు (మరిది) బానోత్ రమేష్.. బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ పడుతున్నారు. వారిద్దరు దగ్గరి బంధువులు కావడంతో వారిలో ఎవరికి ఓటు వేయాలో అర్థంకాని విచిత్ర పరిస్థితి నెలకొంది. కాగా, రజిత గతంలో అదే గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారు.
బానోత్ రమేష్
మూడ్ రజిత
గోమాతకు దండం పెట్టి.. ఆశీర్వాదం పొంది
కురవి: మండలంలోని తట్టుపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుగులోతు రంగమ్మ.. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు బుధవారం గోమాతకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గ్రామంలో తిరుగుతూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.
స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా వర్ధన్నపేట మండలంలో ఇల్లంద పోలింగ్ కేంద్రాన్ని ఎకో ఫ్రెండ్లీ కేంద్రంగా అందంగా, ఆహ్లాదకరంగా ఎన్నికల అధికారులు తీర్చిదిద్దారు.
– వర్ధన్నపేట
కొత్తగూడ: కోతుల బెడదను అరికడుతామని, తమకే ఓట్లు వేయాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మండలంలోని పొగుళ్లపల్లిలో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ముందుగా బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థి కోతులు పట్టే బోన్లు తెప్పించాడు. అందుకు ధీటుగా కాంగ్రెస్ బలరుస్తున్న అభ్యర్థి.. కోతులను పట్టే వ్యక్తులనే దింపాడు.
వదిన – మరిది మధ్య సవాల్
వదిన – మరిది మధ్య సవాల్
వదిన – మరిది మధ్య సవాల్
వదిన – మరిది మధ్య సవాల్
వదిన – మరిది మధ్య సవాల్


