కాంగ్రెస్ ఆదివాసీ నేషనల్ కోఆర్డినేటర్‌గా భూక్య శోభన్
సాక్షి, మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ నేషనల్ కోఆర్డినేటర్‌గా మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన భూక్య శోభన్ బాబును నియమిస్తూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కేజీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా 26 మందిని నేషనల్ కోఆర్డినేటర్లను నియమించగా, అందులో శోభన్ బాబుకు అవకాశం కల్పించారు. శోభన్ బాబు ప్రాథమిక విద్యను ఇనుగుర్తిలో చదివి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ, బెంగుళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. కాంగ్రెస్ ఆదివాసీ శిక్షణ కార్యక్రమం, ట్రైబల్ హబ్ ఏర్పాటులో కీలకంగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జార్ఖండ్ ఇన్‌చార్జ్ కొప్పుల రాజు, విక్రాంత్ భూరియా, తదితరులకు శోభన్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలి
ములుగు రూరల్: మావోయిస్టులు జనజీవన స్రవంతితో కలిసి ప్రశాంత జీవితం గడపాలని జిల్లా ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ ఆకాక్షించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ఇద్దరు మహిళా సభ్యులు ఎస్పీ ఎదుట ఎస్పీ కార్యాలయంలో బుధవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పునరావాస ఆర్థిక సాయం చెక్కులను లొంగిపోయిన సభ్యులు ఒయం రామే, మడకం మల్లి లకు అందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ కమిటీ ఆకాశ్ టీంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. పోరు కన్న – ఊరు మిన్న అవగాహన కార్యక్రమ ప్రభావంతో మావోయిజాన్ని వీడి జీవసీవన స్రవంతిలోకి మావోయిస్టులు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వదకు జిల్లాలో 87 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్టీ శివం ఉపాధ్యాయ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఆదివాసీ నేషనల్ కోఆర్డినేటర్‌గా భూక్య శోభన్
కాంగ్రెస్ ఆదివాసీ నేషనల్ కోఆర్డినేటర్‌గా భూక్య శోభన్


