అధికారులు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Dec 11 2025 9:33 AM | Updated on Dec 11 2025 9:33 AM

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఎస్పీ శబరీష్‌

కేసముద్రం: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరీష్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జీపీ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను ఆయన సందర్శించి మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 163 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. పోలింగ్‌ కేంద్రాల లోపలికి సెల్‌ఫోన్లు, వాటర్‌ బాటిళ్లు, ఇంకుబాటిళ్లు, ఆయుధాలు, పెన్నుల వంటి వస్తువులకు అనుమతి లేదన్నారు. ఓటర్లు క్యూ పద్ధతిని పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. పోలింగ్‌ రోజున ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకే కేంద్రాల్లోకి అనుమతి ఉంటుందన్నారు. ఓటర్లు తమ ఐడీ కార్డులను తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే డయల్‌ 100కు సమాచారం అందించాలని అన్నారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement