ప్లాట్‌ ఫాం నిర్మాణానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ప్లాట్‌ ఫాం నిర్మాణానికి కృషి

Dec 11 2025 9:33 AM | Updated on Dec 11 2025 9:33 AM

ప్లాట్‌ ఫాం నిర్మాణానికి కృషి

ప్లాట్‌ ఫాం నిర్మాణానికి కృషి

మహబూబాబాద్‌ రూరల్‌: ప్రయాణికుల అవసరాల మేరకు మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో నాల్గో నంబర్‌ ప్లాట్‌ ఫాం మంజూరు జరిగేలా కృషి చేస్తానని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ను బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆమె రైలు ప్రయాణంలో తన చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్నారు. మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు. పలువురు ప్రయాణికులు నాలుగో నంబర్‌ ఫ్లాట్‌ ఫాం నిర్మాణం ప్రాముఖ్యతను ఆమె దృష్టికి తీసుకెళ్లగా రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి మంజూరు అయ్యేలా చూస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement