అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి
చిన్నగూడూరు: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా రిటర్నింగ్ అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని టీఓటీ వెంకటేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని ఉగ్గంపల్లి శివారు మంచ్యాతండా రైతువేదికలో రిటర్నింగ్ అధికారులకు ఆయన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల పోలింగ్ సమయంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏమైనా సమస్యలు వస్తే సంబంధిత అధికారులకు తెలపాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంపత్‌కుమార్, ఎంపీడీఓ సుజాత, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల ఫ్లాగ్ మార్చ్
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని సమస్యాత్మక గ్రామాలు సింగారం, వీఎస్.లక్ష్మీపురంలో ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో రూరల్ సీఐ సర్వయ్య, కురవి ఎస్సైలు సతీష్, జయకుమార్, రూరల్ ఎస్సైలు దీపిక, రవికిరణ్, పోలీసు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి


