నాణ్యమైన భోజనం అందించాలి
కురవి: విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి.రాజేశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని నేరడలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కిచెన్, స్టోర్ రూం, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడారు. హాస్టల్ నిర్వహణ సక్రమంగా చేయాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థినులతో హిందీపాఠం చదవించారు. పదో తరగతిలో అందరూ ఉత్తీర్ణులయ్యేలా ప్రణాళికలు తయారు చేయాలని ఎస్‌ఓకు సూచించారు. కార్యక్రమంలో జీసీడీఓ జి.విజయకుమారి, ఎస్‌ఓ సరస్వతి తదితరలు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
దంతాలపల్లి: ఎన్నికల వేళ రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు డీఎస్పీ హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏమైనా సమస్యలు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్‌కుమార్, ఎంపీడీఓ విజయ, టీఓటీలు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
మహబూబాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ విజయ దివస్ కార్యక్రమం నిర్వహించి, తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె పూలమాల వేసి మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో పది సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగి దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నా రు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సలీం, ఆసిఫ్, కిరణ్, అమీర్ పాల్గొన్నారు.
విద్యార్థుల్లో
సృజనాత్మకతను పెంచాలి
కేయూ క్యాంపస్: విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధన దృక్పథాన్ని పెంపొందించేందుకు నోబె ల్ ప్రైజ్‌డే ఉత్సవాలు దోహదం చేస్తాయని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మైక్రోబయాలజీ విభాగంలో యూని వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్, స్టూడెంట్స్ ఆఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, ఆ విభాగం అధిపతి సుజాతతో కలిసి రిజి స్ట్రార్ వి.రామచంద్రం, నోబెల్ ప్రైజ్‌డే ఉత్సవాల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు ప్రదర్శించిన పోస్టర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాల కోఆర్డినేటర్లు బి.వెంకటగోపీనాఽథ్, సంగీత, చంద్రశేఖర్, రంగారెడ్డి, ప్రియాంక,కవిత, మహేందర్ ఉన్నారు.
విద్యార్థుల పోస్టర్ ప్రజంటేషన్..
లైఫ్ సైన్సెస్ విభాగాలకు చెందిన బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ విభాగాల్లో 212 మంది విద్యార్థులు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్ విభాగాల్లో 123 మంది విద్యార్థులు పోస్టర్ ప్రజంటేషన్ పోటీల్లో పాల్గొన్నారు. ఆయా విభాగాల అధిపతులు ప్రొఫెసర్ కృష్ణవేణి, శాస్త్రి, సుజాత, మధుకర్, లక్ష్మారెడ్డి, ప్రొఫెసర్ వై.వెంకయ్య, ప్రొఫెసర్ సురేశ్‌లాల్, మేఘనారావు పాల్గొన్నారు. ఈనెల 10న పోస్టర్ ప్రజంటేషన్, వక్తృత్వపోటీల విజేతలకు సెనేట్‌హాల్‌లో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ఇస్తారి తెలిపారు.
నాణ్యమైన భోజనం అందించాలి
నాణ్యమైన భోజనం అందించాలి


