ఏకగ్రీవ సర్పంచ్‌లు వీరే..
కురవి: జిల్లాలోని కురవి, సీరోలు మండలాల్లోని నాలుగు గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. సీరోలు మండలంలోని బీల్యాతండా, వస్రాంతండా, బూరు గుచెట్టు తండాల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు వాంకుడోత్ ఆశా, బానోత్ కల్యాణి, బానోత్ శివ, కురవి మండలం బంజరతండాలో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి బానోత్ రజిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మడగూడెం సర్పంచ్ ఏకగ్రీవం..
గంగారం: మండలంలోని మడగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఈసం సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవానికి కృషి చేసిన గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.
మరిపెడ మండలంలో..
మరిపెడ రూరల్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మంగళవారం అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోగా.. మండలంలోని పర్కజలతండా (నేతావత్‌తండా) సర్పంచ్‌గా బానోతు కొండయ్య, ఉపసర్పంచ్‌గా గుగులోతు రాము, చింతలగడ్డతండా సర్పంచ్‌గా ఆంగోతు రజితరవీందర్, అజ్మీరతండా సర్పంచ్‌గా అజ్మీరా రవి, ఉపసర్పంచ్‌గా భూక్య కిషన్, ధరావత్‌తండా సర్పంచ్‌గా ధరావత్ తేజానాయక్, అమృనాయక్‌తండా సర్పంచ్‌గా ధరావత్ పద్మరూప్‌లాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో రెండు గ్రామ పంచాయతీలకు ఇద్దరు ఉపసర్పంచ్‌లు ఎన్నిక కాగా, మరో మూడు పంచాయతీలకు ఉపసర్పంచ్‌లను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు సర్పంచ్‌లు ఎన్నిక కాగా, ఒకరు స్వతంత్ర అభ్యర్థి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అలాగే ఎలమంచిలితండాలో సర్పంచ్ అభ్యర్థి బానోత్ భద్రునాయక్, 6వార్డులు ఏకగ్రీవం కాగా, మరో రెండు వార్డుల్లో పోటీ నెలకొంది.
ఆరు జీపీలు..
కొత్తగూడ: మండలంలో ఆరు గ్రామాల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా, బీఆర్‌ఎస్ మద్దతుదారులు ఉప సర్పంచ్‌లుగా తీర్మానం చేసుకుని మిగతా వారు నామినేషన్లు ఉపసంహరించకున్నారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికైన కుంజ భిక్షపతి(కోనాపురం), ఆలూరి కిరణ్(సాదిరెడ్డిపల్లి), మాలోతు లక్ష్మి(రేణ్యతండా), వాసం నర్సమ్మ(ఎంచగూడెం), వంక రాములు (మొండ్రాయిగూడెం), పెనక సిరివెన్నెల(కార్లాయి)కు ఆయా క్లస్టర్ ఎన్నికల అధికారులు కలెక్టర్ అనుమతి రాగానే ఎంపిక పత్రాలు అందజేస్తామని తెలిపారు.


