అండర్–16 అంతర్ జిల్లాల విజేత వరంగల్
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5న ప్రారంభమైన అండర్–16 అంతర్ జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలు మంగళవారం ముగిశాయి. కరుణాపురం సమీపంలోని వంగాలపల్లి, మొగిలిచర్లలోని క్రీడా మైదానాల్లో ఐదు రోజుల పాటు హనుమకొండ, వరంగల్, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్ జిల్లాలకు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఎంపిక పోటీలు నిర్వహించారు. వంగాలపల్లి మైదానంలో వరంగల్, ములుగు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో వరంగల్ విజయం సాధించి ఇంట్రాడిస్ట్రిక్ట్ చాంపియన్‌గా నిలిచింది. ఐదు జిల్లా జట్లలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 20 మందితో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాబబుల్ జట్టును ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెలలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. కార్యక్రమంలో సెలక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పుల్లూరి శ్రీనివాస్‌గౌడ్, క్రికెట్ సంఘం జిల్లా అధ్యక్షుడు అచ్చా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు రఘురామ్, నిజాముద్దీన్, తోట రాము, సంయుక్త కార్యదర్శి ఉపేందర్, కార్యవర్గ సభ్యులు అభినవ్‌వినయ్, ఆవాల వేణుగోపాల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.


