ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు..
ఈదులపూసపల్లి రోడ్డు వేల్పుల సత్యనారాయణ నగర్ కాలనీలో అనుమతులు లేని ఓ ప్రైవేట్ పాఠశాలపై చాలాసార్లు ఫిర్యాదు చేసినా జిల్లా విద్యాశాఖ అధికారులు అసలు స్పందించడం లేదు, విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలలకు వత్తాసు పలుకుతూ మూముళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. యాజమాన్యం మా వెనుక పోలీస్ బలం ఉంది, విద్యాశాఖ అధికారులు మేము చెప్పినట్టు వింటారు అంటూ బెదిరిస్తున్నారు. అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.
– గూగులోతు సూర్య ప్రకాశ్, డీఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు


