పీఆర్సీ అమలు చేయాలి
మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలతో పాటు పీఆర్సీ అమలు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సోమవారం మండల ప్రధానకార్యదర్శి సారెడ్డి లింగారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలైనా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించలేదన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ చుంచు శ్రీశైలం, జిల్లా కార్యదర్శి రాచకొండ ఉపేందర్, సీనియర్ నాయకులు విష్ణువర్ధన్, వివిధ మండలల అధ్యక్షులు యాకయ్య, విద్యాసాగర్, నాయకులు గోవర్ధన్, ప్రసాదరావు, మురళి, శ్రీనివాస్ కార్తీక్, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.
11న మార్కెట్‌కు సెలవు
కేసముద్రం: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈనెల 11న కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తిరిగి 12 తేదీన మార్కెట్ పునః ప్రారంభం అవుతుందని తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
తొర్రూరు: నేషనల్ యూత్ వలంటీర్ల ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేరా యువ భారత్ ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ సోమవారం తెలిపారు. పదో తరగతి అర్హత కలిగిన ఉమ్మడి జిల్లాకు చెందిన 18 నుంచి 29 ఏళ్ల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ స్వచ్ఛంద సేవకు ఎంపికై న వలంటీర్లకు నెలకు రూ.5వేల ప్రోత్సాహకం అందుతుందన్నారు. ఎంపికై న యువ వలంటీర్లు క్రీడలు, ఆరోగ్యం, అక్షరాస్యత, పారిశుద్ధ్య, లింగ వివక్ష తదితర అంశాలపై ప్రజలను చైతన్యపర్చాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు http://nyks.nic.in/ NationalCorps/nyc.html వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మత్తు పదార్థాలకు
బానిసలు కావొద్దు
మహబూబాబాద్ రూరల్ : యువకులు గంజాయి, డ్రగ్స్ వినియోగంతో తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి అన్నారు. జాగృతి పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దె రాజగోపాల్ కాలనీలో మంత్రాలు, మూఢనమ్మకాలు, ఆన్‌లైన్ గేమింగ్, రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై సోమవారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ మాట్లాడుతూ.. వృద్ధులైన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నారు. 1930 సైబర్ టోల్ నంబర్, ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతీఒక్కరు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో టౌన్ ఎస్సై షేక్ షాకీర్, జిల్లా పోలీసు కళాబృందం సభ్యులు పృథ్వీ రాజ్, సత్యం, తిరుపతి, తారాసింగ్, పోలీసు స్టేషన్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
రైల్వే డిపోను మానుకోట లోనే ఏర్పాటు చేయాలి
నెహ్రూసెంటర్: రైల్వే మెయింటెనెన్స్ డిపోను మానుకోటలోనే ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాయం చిన్న చంద్రన్న డిమాండ్‌చేశారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో పార్టీ సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మానుకోట వెనుకబాటుకు గురవుతుందని, నాడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నేడు రై ల్వే మెయింటెనెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు. వేలాది మంది నిరుద్యోగులు ఉన్న మానుకోటలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించడం సరికాదన్నారు. మె యింటెనెన్స్ డిపో సాధించే వరకు అన్ని వర్గాల ప్రజలు పోరాటాలు సాగించాలని పిలుపుని చ్చారు. అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించి డిపో తరలించకుండా అడ్డుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి రవి, సత్యం, జగత్‌రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.
పీఆర్సీ అమలు చేయాలి
పీఆర్సీ అమలు చేయాలి


