ధాన్యం రాశులతో మార్కెట్ కళకళ
మార్కెట్ కవరు షెడ్డులోని ధాన్యం రాశులు
● నేడు కొనుగోళ్లు బంద్
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు సోమవారం రైతులు తీసుకొచ్చిన ధాన్యం రాశులతో కళకళలాడింది. 4,026 క్వింటాళ్ల ధాన్యం (6,193 బస్తాలు) కొనుగోళ్లు చేయగా.. కాంటాల్లో ఆలస్యమైంది. కాగా వ్యాపారస్తుల కోరిక మేరకు మంగళవారం ధాన్యం కొనుగోళ్లకు బంద్ ప్రకటించామని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. బుధవారం యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని, రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.


