అవినీతి జలగలు!
లంచం అడిగితే ఫిర్యాదు చేయాలి
ప్రజల రక్తం పీల్చుతున్న వివిధ శాఖల ఉన్నతాధికారులు
వరంగల్ క్రైం : అవినీతి జలగలు( ప్రభుత్వ ఉన్నతాధికారులు) ప్రజల రక్తం పీల్చుతున్నాయి. ప్రజ లకు హక్కుగా లభించాల్సిన ప్రభుత్వ సేవలకు అ డుగడుగునా కప్పం కట్టాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. కిందిస్థాయి ఉద్యోగులు అవినీతికి పాల్ప డితే ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేద్దామనుకుంటే పై న ఇంకా పెద్ద తిమింగలాలు ఉంటున్నాయనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఒకపక్క అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తుంటే మరోపక్క అవినీతి పరులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. స్టాంప్ అండ్ రిజిస్టేషన్స్, రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్‌పోర్ట్, విద్యు త్, మున్సిపాల్, ఎకై ్సజ్, విద్య, వైద్యారోగ్య శాఖల్లో అవినీతికి తావున్నప్పటికీ దాడులు కొన్ని శాఖలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అధికారులను పట్టుకున్నా లంచం తీసుకోవడానికి ఏమ్రాతం వెనుకడుగు వేయడం లేదు. ఫలితంగా కొన్ని శాఖల్లో అవినీతి హక్కుగా మారుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్‌టీఏ, రెవెన్యూ, రిజిస్టేషన్ శాఖల్లో ప్రతీ ఫైల్‌కు లెక్కను పక్కాగా ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ఎవరైనా, ఎక్కడైనా ఇదేంటని ప్రశ్నిస్తే ఇక్కడ ఇంతే అనే స మాధానం ఎదురవుతోంది. దీనిని బట్టి అవినీతి ప్ర భుత్వ శాఖల్లో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థమవుతోది. ఈ క్రమంలో మంగళవారంతో అవి నీతి నిరోధక వారోత్సవాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఏసీబీకి పట్టుబడిన అధికారులపై ‘సాక్షి’ కథనం
పట్టుబడుతున్న అవినీతి అధికారులు..
చాలా మంది ప్రభుత్వ అధికారుల అవినీతి మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్థిల్లుతోంది. బాధితులు.. అవినీతి అధికారుల వేధింపులు భరిస్తూనే వారి డిమాండ్లు నెరవేరుస్తున్నారు. ఏసీబీ అధికా రుల ఫిర్యాదు చేస్తా తప్ప దాడులు చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. గతంలో అవినీతికి పాల్పడిన అధికారులను హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలించే వారు.అయితే వ రంగల్‌లో ఏసీబీ కోర్టు ఏర్పాటు కావడంతో ఇక్కడే హాజరపరుస్తున్నారు. కాగా, అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కితే బాధితులు సంబురాలు చేసుకుంటున్నారు. దీనిని బట్టి అవినీతి అధికారుల డిమాండ్లు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థమవుతోంది.
● ఈనెల 5న ఓ ప్రైవేట్ పాఠశాల అనుమతుల పునరుద్ధరణకు రూ.లక్ష డిమాండ్ చేసి రూ. 60 వేలు ఒప్పందం కుదుర్చుకున్న హనుమకొండ అదనపు కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈఓ వెంకట్‌రెడ్డి, విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది గౌస్, మనోజ్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు అదనపు కలెక్టర్ ఇంట్లో సోదాలు చేయగా రూ. 30 లక్షలు నగదు లభించింది. వెంకట్‌రెడ్డి అవినీతి అధికారులకు పట్టుపడటం ఇది మూడోసారి కావడం గమనార్హం.
● ఈ ఏడాది జనవరి 6న మహబాబాబాద్ జిల్లా తొర్రూరు సీఐ కర్రి జగదీశ్.. పీడీఎస్ బియ్యం వ్యాపారి నుంచి రూ.4 లక్షలు డిమాండ్ చేసి అప్పటికే రూ. 2 లక్షలు తీసుకున్నారు. మరో రెండు లక్షల కోసం చూస్తుండగా ఏసీబీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించింది.
● ఫిబ్రవరి 6న ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై, పలు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విలువల ప్రకారం రూ. 5 కోట్లపైబడే అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.
● ఈఏడాది మార్చి 20న స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్‌చార్జ్ సబ్‌రిజిస్ట్రార్ పర్వతం రామకృష్ణ.. గిఫ్ట్ రిజిస్టేషన్ కోసం ఓ ప్రైవేట్ ఉద్యోగి ద్వారా రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. సె ప్టెంబర్ 1న తన బ్యాంకు లాకర్‌లో రూ. 6 లక్షలు లభిస్తే వాటికి లెక్కలు చూపకపోవడంతో ఏ సీబీ అధికారులు మరోసారి రామకృష్ణపై ఆదా యానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు.
● జూన్ 13న జనగామ జిల్లా ఆర్‌అండ్‌బీ శాఖలో ఓ కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరులో రూ. 80 వేలు లంచం తీసుకుంటుండగా ఈఈ చిలుకపాటి హుస్సేన్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
● ఆగస్టు 23న మహబాబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్‌లో ఎకై ్సజ్ కేసులో ఇన్‌స్పెక్టర్ భూక్య రాజేశ్, కానిస్టేబుల్ ధరావత్ రవి.. బాధితుడి నుంచి రూ. 30 వేల లంచం తీసుకుని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.
● నవంబర్ 21న జనగామ జిల్లా పాలకుర్తి సబ్ డివిజన్ మిషన్ భగీరథ డిప్యూటీ ఇంజనీర్ కూనమళ్ల సంధ్య(డీఈ).. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
● నవంబర్ 28న మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర్ తహసీల్దార్ వీరగంటి మహేందర్.. గిఫ్ట్ రిజిస్టేషన్ విషయంలో రూ. 10 వేల లంచం తీసుకుని పట్టుబడ్డాడు. ఇదే కేసులో ప్రైవేట్ డ్రైవర్ తుప్పరి గౌతంను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
సంవత్సరం కేసులు
2020 7
2021 7
2022 9
2023 11
2024 18
2025 19
పెరుగుతున్న ఏసీబీ దాడులు.. అయినా మారని తీరు
ఇప్పటికే 19 కేసులు నమోదు.. హక్కుగా మారుతున్న అవినీతి
నేటితో అవినీతి నిరోధక వారోత్సవాలు ముగింపు
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి. హక్కుగా లభించే పనులకు లంచం ఇవ్వొద్దు. అవినీతి అధికారుల సమాచారం అందించే వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతాం. అవినీతి అధికారులపై ట్రోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలి. వరంగల్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ నంబర్ 9154388912కు ఫిర్యాదు చేయాలి.
– పి. సాంబయ్య డీఎస్పీ, ఏసీబీ


