కాజీపేట మీదుగా ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా యశ్వంతాపూర్–హజ్రత్ నిజాముద్దీన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
డిసెంబర్ 8వ తేదీ (సోమవారం) యశ్వంతాపూర్–హజ్రత్ నిజాముద్దీన్ (06569) ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు మంగళవారం చేరుకుని వెళ్తుంది. డిసెంబర్ 10వ తేదీ( బుధవారం)న హజ్రత్ నిజాముద్దీన్–బెంగళూరు (06570) ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు గురువారం చేరుకుని వెళ్తుంది. ఈ రెండు రైళ్ల సర్వీస్‌లకు యెలహంక, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్ సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్, భోపాల్, బీనా, గ్వాలియర్, ఆగ్రా, మధుర స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు అధికారులు తెలిపారు.
జాతరకు సహకరించాలి
హన్మకొండ: మేడారం జాతరకు సహకరించాలని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజ యభాను కోరారు. ఈ మేరకు సోమవారం ములు గు ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, డీఎఫ్‌ఓ కిషన్ జాదవ్‌ను ములుగులో కలిశారు. ఈ సందర్భంగా 2026 మేడారం జాతరపై వారితో చర్చించారు. ఆర్టీ సీ ఏర్పాట్లను వివరించారు. జాతరకు వచ్చే భక్తులు, సిబ్బందికి చేయాల్సిన ఏర్పాట్లు, ఆయా శాఖల ద్వారా అందించాల్సిన సహకారం గురించి చర్చించారు. సమన్వయం, సహకారంతో ముందుకెళ్తామని నిర్ణయించుకున్నారు. ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ రవి చందర్ పాల్గొన్నారు.


