సర్పంచ్‌గా గెలిపిస్తే..
● వచ్చే వేతనంతో
ప్రభుత్వ పాఠశాలల
అభివృద్ధికి కృషి
● రూ.100 బాండ్ పేపర్‌తో
ప్రేమ్‌కుమార్ ప్రచారం
స్టేషన్‌ఘన్‌పూర్: జీపీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే వచ్చే వేతనంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని మండలంలోని మీదికొండ సర్పంచ్ అభ్యర్థి జోగు ప్రేమ్‌కుమార్ అన్నా రు. ఈ మేరకు తాను గెలిస్తే చేపట్టనున్న కార్యక్రమాలను రూ.100 బాండ్ పేపర్‌పై పొందుపరిచి సంతకం చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వాటర్ ప్యూరిఫైయర్, పాఠశాలల పచ్చదనం, పరిశుభ్రత, పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు, తదితర సౌకర్యాల కల్ప నకు కృషి చేస్తానని ప్రచారం నిర్వహిస్తున్నారు.


