ఇంటర్‌వర్సిటీ టోర్నమెంట్‌కు కేయూ జట్టు
కేయూ క్యాంపస్: విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో ఈనెల 9నుంచి 11 తేదీ వరకు నిర్వహించనున్న సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ టేబుల్ టెన్నిస్ మహిళల టోర్నమెంట్‌కు కాకతీయ యూనివర్సిటీ మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు పాల్గొననున్నట్లు సోమవారం కేయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. జట్టులో ఎం.శ్వేత, పి.వర్షిత, ఎం.వర్షిత, పి.శ్రావణి, ఎం.నందిని ఉన్నారు. వీరికి కోచ్‌కమ్ మేనేజర్‌గా జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ టి.కల్యాణి వ్యవహరిస్తున్నట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వెంకయ్య తెలిపారు.


