ఓటర్లకు డబ్బులిచ్చినా... భయపెట్టినా నేరమే..
ఎనికల ఖర్చులు చూపకుంటే..
డబ్బులు, బహుమతులు
ఇచ్చి ఓటు అడగడం..
విచారణలో నేరం నిరూపణ అయితే జైలు శిక్ష, జరిమానా
పాలకుర్తి టౌన్: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎలాగైనా గెలవాలని డబ్బులు, మద్యం పంచడం, బెదిరింపులకు పాల్పడడం, తప్పుడు ప్రచారం చేయడం వంటి ప్రలోభాలకు పాల్ప డుతుంటారు. ఇలా చేస్తే నేరానికి పాల్పడినట్లే. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్)–2023 ప్రకారం.. ఎన్నికల సమయంలో నేరానికి పాల్పడిన వారికి సెక్షన్ 169 నుంచి 177 వరకు శిక్షలు ఉన్నాయి.
అభ్యర్థులు తమకు అనుకూలంగా ఓటు వేయాలని ఓటర్లను బెదిరించడం, వారిపై ఒత్తిడి తీసుకురావడం, వైరంతో కూడిన ప్రచారం చేయడం కూడా నేరమే. ఇవి నిరూపణ అయితే ఏడాది జైలు శిక్ష పడుతుంది.
చనిపోయిన వారి పేరుపై ఓటు వేయాలని ప్ర యత్నించడం, మారుపేరుతో ఓటు వేయడం, లేదా ఒకసారి ఓటు వేశాక.. మరోసారి వేయాలని ప్రయత్నించడం, దొంగ ఓట్లు వేసేలా ఇతరులను ప్రోత్సహించడం వంటి పనులు చేస్తే, ఏడాది వరకు జైలు శిక్ష ఉంటుంది.
ఫలితాలను ప్రభావితం చేసేలా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి వ్యక్తిత్వం గురించి అబద్ధపు ప్రకటనల (వివాహేతర సంబంధాలున్నాయని, అతను స్మగ్లర్ అని, మంచి వాడు కాదని, అతను ఒక కుల, ఒక మతం వాడని, లాంటిచర్యలు)తో ప్రచారం చేయడం నేరం. నిరూపణ అయితే జరిమానా విధిస్తారు.
నిబంధనల ప్రకారం ఎన్నికల ఖర్చులు సంబంధిత అధికారులకు సమయంలోపు చూపించాలి. లేకపోతే రూ. 500 వరకు జరిమానా విధిస్తారు. ఎన్నికల సమయంలో నేరాలు జరినట్లు ఆధారాలతో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తే అవసర మైతే కేసు నమోదు చేస్తారు. కేసు నిరూపణ అయితే అభ్యర్థిపై అనర్హత వేటు పడడంతోపాటు, చట్ట ప్రకారం శిక్ష పడే అవకాశముంది.
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు డబ్బు ఆశ చూపి, మద్యం, బియ్యం, వస్త్రాలు, ఇతర వస్తువులు, బహుమతులు ఇచ్చి ఓటు అడగడం నేరం.ఈ నేరం నిరూపణ అయితే ఏడాది జైలు, జరిమానా విధిస్తారు.
ఓటర్లకు డబ్బులిచ్చినా... భయపెట్టినా నేరమే..


