ఉత్సాహంగా బాక్సింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని డీఎస్‌ఏ బాక్సింగ్‌హాల్‌లో సోమవా రం పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–14 బాలుర ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. పీఈటీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భోగి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఎంపికలను ప్రారంభించి మాట్లాడారు. పట్టుదల, క్రమశిక్షణ అలవర్చుకున్నప్పుడే క్రీడల్లో లక్ష్యం సాధిస్తారన్నారు. ఎంపికలకు ఉమ్మడి జిల్లా నుంచి 90 క్రీడాకారులు హాజరైనట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు హనుమకొండ వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి డీవైఎస్‌ఓ రఘు, బాక్సింగ్ సంఘం జిల్లా ప్రతినిధులు పెద్దమ్మ, నర్సింహరాములు, స్విమ్మింగ్ సంఘం జిల్లా కార్యదర్శి మంచాల స్వామిచరణ్, ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం శోభారాణి, పీడీ శ్రీధర్‌రావు, సెలక్షన్ కమిటీ కన్వీనర్ శీలం పార్థసారధి, బాక్సింగ్ అఫిషియల్స్ శ్యాంసన్, జీవన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


